ప్రేమను పంచిన మానవతామూర్తి ఆర్లే మన్సన్ అమెరికాలో జన్మించారు. తల్లిదండ్రుల ప్రభావంతో బాల్యం నుంచే మానవతా దృక్పథం అలవడింది. వైద్యపట్టా పుచ్చుకొన్న మన్సన్ మహారాష్ట్రకు చెందిన కర్మాకర్ పరిచయ ప్రభావంతో వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో భారత్ వచ్చారు. మన దేశంలో ఎటువంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో జీవితాంతం సమాజసేవలో తరించారు. కలరా వ్యాధి వ్యాపించినప్పుడు సామాన్యులను కాపాడేందుకు డాక్టర్ మన్సన్ చేసిన కృషి మరువలేనిది.