బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ కన్నడ సినీ నటి రన్యారావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ సీఎం సిద్ధరామయ్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంతో పాటు వీఐపీ ప్రొటోకాల్ దుర్వినియోగం.. అందులో ఆమె సవతి తండ్రి ప్రమేయం తేల్చేందుకు ప్రత్యేక విచారణకు ఆదేశించారు. దర్యాప్తును త్వరగా పూర్తి చేసి నివేదిక అందజేయాలని సీఐడీని ఆదేశించారు.