AP: అధికారంలో వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి.. ఇప్పుడు వారికి కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. "మాట తప్పి మోసం చేయడం అంటే ఇదే. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవి. అంగన్వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ.26వేలు ఇవ్వాలి. తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలి." అని షర్మిల డిమాండ్ చేశారు.