ప్రపంచంలోని టాప్-20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయి. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూఎయిర్ రూపొందించిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా కొనసాగుతోంది. తర్వాత స్థానాల్లో బైర్నిహాట్, ముల్లన్‌పూర్ (పంజాబ్), ఫరీదాబాద్, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్, హనుమాన్‌ఘర్ నగరాలు ఉన్నాయి.