భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని వ్యక్తి దారుణ హత్య

1569చూసినవారు
భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని వ్యక్తి దారుణ హత్య
తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడాని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈనెల 7న రాయికల్‌ మండలంలో ఈ ఘటన జరిగింది. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ వివరాల ప్రకారం మండలంలోని తాట్లవాయికి చెందిన నాగెల్లి సురేశ్, నాగెల్లి భూమేశ్‌ వరుసకు అన్నదమ్ముల్లు. సురేశ్‌ తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని భూమేశ్‌ అతడిని కత్తితో నరికి చంపాడు. సురేశ్‌ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం భూమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్