బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. భర్తతో గొడవ పడి కోపంతో కన్న బిడ్డలను చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీమా దేవి తన భర్త చందన్ మహత్తతో గొడవ పడింది. ఆ కోపంతో పిల్లల్ని తీవ్రంగా కొట్టి ఇంటి సమీపంలో ఉన్న బావిలో పడేసింది. పైగా పిల్లలు కనిపించడం లేదంటూ భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా.. అసలు విషయం బయటపడింది.