తిరుపతి నుంచి విడుదలైన కొత్త వేరుశనగ రకం

71చూసినవారు
తిరుపతి నుంచి విడుదలైన కొత్త వేరుశనగ రకం
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని, అధిక దిగుబడులను సాధించే దిశలో వేరుశనగలో ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్-1707) అనే కొత్త రకాన్ని తిరుపతి పరిశోధన స్థానంలో రూపొందించారు. ఈ వేరుశనగ రకం ఖరీప్ కాలానికి అనుకూలమైనది. 110- 115 రోజుల్లో పంటకొస్తుంది. ఎకరాకు 9.9 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాల్లో సాగుకు అనువైనది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్