మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని ఎయిర్‌స్ట్రిప్‌లో ఆదివారం ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ట్రైనర్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారని అధికారులు తెలిపారు. రెండు సీట్లు ఉండే సెస్నా 152 విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు కూలిపోయిందని, ఇంజన్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని గుణ కాంట్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దిలీప్ రాజోరియా తెలిపారు. ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయని, వారిని ఆస్పత్రికి తరలించామన్నారు.