‘పుష్ప2’లోని ‘పీలింగ్స్’ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2’. రష్మిక కథానాయిక. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. భారీ వసూళ్లు సాధించింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ‘పీలింగ్స్’ సాంగ్ మాస్‌తో విజిల్స్ వేయించింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.