TG: అప్పులపై అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను ఆర్థికమంత్రి తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. దీనిపై ప్రివిలేజ్ మోషన్ కు అనుమతించాలని స్పీకర్ ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర అప్పు రూ.3.90 లక్షల కోట్లు ఉందని RBI చెబితే ప్రభుత్వం రూ.6.90 లక్షల కోట్లు అని చెబుతోందని ఆయన మండిపడ్డారు.