TG: జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేసిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబు, మనోజ్ వివాదానికి సంబంధించి 3 FIRలు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆయన అరెస్టు విషయంలో ఆలస్యం లేదని, ఈ నెల 24 వరకు సమయం అడిగారని చెప్పారు. 24లోపు విచారించడంపై కోర్టును అనుమతి కోరుతామన్నారు. ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చామని, మరోసారి ఇస్తామని పేర్కొన్నారు.