వానలు కురవాలని పిల్లుల ఊరేగింపు!

70చూసినవారు
వానలు కురవాలని పిల్లుల ఊరేగింపు!
వానలు కురవడం ఆలస్యమైతే మనవాళ్లు కప్పల పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. అయితే, కంబోడియా, మయాన్మార్, వియత్నాం తదితర ఆగ్నేయాసియా దేశాల్లో మాత్రం పిల్లుల ఊరేగించటం ఆచారం. ఇక్కడ వర్షాలు సకాలంలో కురవకుంటే 'హే న్యాంగ్ మ్యావ్' పేరుతో పిల్లుల ఊరేగింపు నిర్వహిస్తుంటారు. ఆడపిల్లులను, ముఖ్యంగా నల్ల పిల్లులను ఎంపిక చేసుకుని వెదురు బుట్టల్లో కూర్చోబెట్టి ఊళ్లోని ప్రతి ఇంటి వద్ద ఆగుతూ సంప్రదాయ వాద్యాలు వాయిస్తూ ఊరేగిస్తారు.

సంబంధిత పోస్ట్