లండన్‌లో ప్రకాశం జిల్లా వాసి మృతి చెందాడు. చీమకుర్తి మండలం బోధవాడకు చెందిన చిరంజీవి (32) లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం కారులో వెళ్తుండగా కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. కారులో అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.