యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ జిల్లా జాజ్మౌ పోలీస్ స్టేషన్ సమీపంలోని గల్లగోదాము క్రాసింగ్ వద్ద కారు అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.