స్మార్ట్ ఫోన్లన్నీ పూర్తిగా యాప్‌ల ఆధారంగా పనిచేస్తున్నాయి. ఏ అవసరానికైనా యాప్‌లనే వాడాల్సి వస్తోంది. కానీ దీనికి భిన్నంగా తాజాగా డాయిషే టెలికాం కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే దీన్ని ఎలాంటి యాప్‌లు అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో తమ టీ-ఫోన్ డివైజ్‌లోని ఈ కాన్సెప్ట్‌ను కంపెనీ వివరించింది.