తమిళ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన వారిలో
లోకేశ్ కనగరాజ్ ఒకరి. ‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ 171వ చిత్రాన్ని దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాకు దాదాపు రూ.60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ‘జీ స్క్వాడ్’ పేరుతో సినిమాలు నిర్మించనున్నట్లు సమాచారం.