దోమలకు ఓ గుడి.. ప్రత్యకత ఏంటో తెలుసా?

76చూసినవారు
దోమలకు ఓ గుడి.. ప్రత్యకత ఏంటో తెలుసా?
దోమలకు గుడి కట్టారని వినగానే విచిత్రంగా, హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ఇది నిజం. ఏపీలోని ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామ పిహెచ్‌సి ఆవరణలో దోమల ఆలయం ఏర్పాటు చేశారు. 2008లో రూ.5వేల వ్యయంతో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎం.సతీష్ కుమార్ దీనిని నిర్మించారు. అయితే, ఇందులో దోమలను పూజించరు. దోమల వల్ల వచ్చే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఆలయాన్ని నిర్మించారు.

సంబంధిత పోస్ట్