ఘోర ప్రమాదం.. 17 మంది మృతి

73720చూసినవారు
ఘోర ప్రమాదం.. 17 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని కవర్దాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులతో కూడిన పికప్ వాహనం బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్