రుద్రాణికి ఘోర అవమానం

14259చూసినవారు
రుద్రాణికి ఘోర అవమానం
బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ డిసెంబర్ 30న 1236 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. గత ఎపిసోడ్‌లో శ్రీవల్లి, కోటేష్‌ల బాబు(మోనిత కొడుకు)ని రుద్రాణి లాక్కుని పోతుంది. దీపని, కార్తీక్‌ని ఇందులో కలుగజేసుకోవద్దని బెదిరించి వెళ్లిపోయింది. కేసు పెడదామని శ్రీవల్లి, కోటేష్‌ పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. దీంతో నేటి కథనం చాలా ఆసక్తిగా మారింది.

నేటి ఎపిసోడ్ లో కార్తీక్ బాధగా దీపతో 'మనం శ్రీవల్లి వాళ్లతో వెళ్లి ఉండాల్సింది. నేను రుద్రాణి ఇంటికెళ్లి తేల్చుకుంటాను. బాబుని తీసుకొస్తాను’ అంటాడు. దీప భయపడుతుంది, వద్దు అని ఆపుతుంది. పోలీస్ స్టేషన్‌కైనా వెళ్తాను అంటే దీపతో పాటు పిల్లలు కూడా కార్తీక్‌ని వెళ్లొద్దని ఆపుతారు. దాంతో కార్తీక్ ఆగిపోతాడు. ఇక రుద్రాణి బాబుని ఇంట్లో ఆడిస్తూ ఉండగా.. పోలీసులు వస్తారు. రుద్రాణి షాక్ అవుతుంది. పోలీస్ అధికారి మాధురి, ఓ కానిస్టేబుల్, శ్రీవల్లి, కోటేష్‌లతో కలిసి రుద్రాణి ముందుకు వస్తారు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ నేనుంటాను అని మాధురి అంటుంది. రుద్రాణి వేలు చూపిస్తూ తన పొగరు చూపిస్తుంటే.. మాధురి రుద్రాణిని లాగిపెట్టి కొడుతుంది. ‘నన్నే కొడతావా?’ అనేలోపు రెండో చెంపపై చేయి చేసుకుంటుంది.

రుద్రాణి తన రౌడీలతో అటాక్ చేయించేలోపు మాధురి గన్ తీసి బాబుని ఇవ్వమంటుంది. దాంతో బాబుని కోటేష్ వాళ్లకి అందిస్తారు. బాబుని తీసుకుని వెళ్లమని శ్రీవల్లిని మాధురి పంపేస్తుంది. ఆ తర్వాత రౌడీలకు బయటకు పంపి, కానిస్టేబుల్‌కి తలుపు వేసి వెళ్లమని మాధురి సైగ చేస్తుంది. రుద్రాణి, మాధురి మాత్రమే లోపల ఉంటారు. కాసేపటి తర్వాత తలుపు తీసి మాధురి బయటికి వస్తుంది. రుద్రాణి కుంటుకుంటూ వచ్చి జీప్ ఎక్కుతుంది.

ఇక రత్నసీత.. మహేష్‌(కార్తీక్ ఫోన్ దొరికిన వ్యక్తి)ని సౌందర్య దగ్గరకు తీసుకొస్తుంది. కార్తీక్ ఫోన్ పడేసి, దీప, పిల్లలతో బస్సు ఎక్కారని మహేష్ చెబుతాడు. దాంతో సౌందర్య 'వాళ్లు ఎక్కడైతే ఆ బస్సు ఎక్కరో అదే బస్సు నువ్వు ఎక్కి, ప్రతి స్టాప్‌లోనూ దిగి మా వాళ్లని వెతుకు.. డబ్బు ఇస్తా’ అని అంటుంది. మహేష్ అందుకు సరే అంటాడు. ఇక కోటేష్, శ్రీవల్లి బాబుని తీసుకుని ఇంటికి వస్తారు. బాబుని చూసి దీప, కార్తీక్ చాలా సంతోషిస్తారు. సౌందర్య భోజనానికి కూర్చుని.. కార్తీక్, దీపల గురించి బాధపడుతూ ఉంటుంది.

సంబంధిత పోస్ట్