హెచ్‌బీవో ఫౌండర్‌ కన్నుమూత

83చూసినవారు
హెచ్‌బీవో ఫౌండర్‌ కన్నుమూత
కేబుల్ టీవీ దిగ్గజం హెచ్‌బీవో (HBO) టీవీ చానెల్‌ వ్యవస్థాపకుడు చార్లెస్ డోలన్ కన్నుమూశారు. 98 ఏళ్ల వయసులో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. చార్లెస్ డోలన్ 1972లో హెచ్‌బీవోని స్థాపించారు. తర్వాత ఏడాదిలోనే దేశంలోని అతిపెద్ద కేబుల్ ఆపరేటర్‌లలో ఒకటైన కేబుల్‌ విజన్‌ని సృష్టించారు. కాగా, డోలన్‌ భార్య కూడా కొన్ని నెలల క్రితమే మరణించారు. వీరికి ఆరుగురు సంతానం ఉన్నారు.

సంబంధిత పోస్ట్