ఎండలో నడిరోడ్డుపై ఆమ్లెట్ వేసిన మహిళ.. (వీడియో)

76చూసినవారు
ప్రస్తుతం మన దేశం భయంకరమైన ఉష్ణోగ్రతలతో ఉడికిపోతోందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎండ తీవ్రతను తెలియపరుస్తూ ఓ మహిళ సోషల్ మీడియా పట్టాలెక్కింది. tejalmodi454 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ రోడ్డును నీటితో క్లీన్ చేసింది. ఎర్రటి ఎండలో రోడ్డుకు నూనె రాసి.. రెండు గుడ్లను పగలగొట్టి ఆమ్లెట్‌ వేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్