తల్లి మందలించిందని.. నదిలోకి దూకిన బాలిక (వీడియో)

80చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. తల్లి మందలించిందని.. ఓ బాలిక అకస్మాత్తుగా వంతెనపై నుంచి గోమతి నదిలోకి దూకింది. నదిలో దూకుతున్న బాలికను గమనించిన సమీపంలోని మత్స్యకారులు పడవతో అక్కడికి చేరుకుని నీటిలో మునిగిపోకుండా కాపాడారు. మత్స్యకారులు బాలికను పడవలో బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్