కోల్‌కతాలోని ఆనందపూర్ లో పొదల్లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యం

599చూసినవారు
కోల్‌కతాలోని ఆనందపూర్ లో పొదల్లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యం
కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా కోల్‌కతాలోని ఆనందపూర్ లో మరో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. చెట్ల పొదల్లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి శవపరీక్షకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మహిళ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్