వరంగల్ జిల్లా ఏనుముల మార్కెట్ సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన బొనగాని జస్వంత్(19) అనే యువకుడు తోటి మిత్రులతో కలిసి బొగత జలపాతానికి వచ్చాడు. అనంతరం జలపాతంలో స్నానాలు చేసేందుకు నీటిలోకి దిగగా.. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో జస్వంత్ నీటిలో కొట్టుకుపోయాడు. అతడి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న వెంకటాపురం పోలీసులు గజ ఈతగాళ్ళతో వెతికించి సాయంత్రానికి మృదేహాన్ని వెలికి తీశారు.