మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల కుమార్తెపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు వ్యక్తి గత జూన్ నుంచి తన కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లికి ఇటీవలే తెలియడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.