కెనడా వెళ్లేందుకు వృద్ధునిగా మారిన యువకుడు

82చూసినవారు
కెనడా వెళ్లేందుకు వృద్ధునిగా మారిన యువకుడు
అక్రమ పద్ధతిలో విదేశానికి వెళ్లేందుకు ప్రయత్నించిన 24 ఏళ్ల యువకుడు అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ యువకుడు 67 ఏళ్ల వ్యక్తి పాస్‌పోర్ట్‌పై కెనడాకు వెళ్లడానికి ప్రయత్నించాడు. అందుకోసం అతను వృద్ధుడిగా మారాడు. అయితే, చెకింగ్ సమయంలో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం రావడంతో అతన్ని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో యువకుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్