పిన్నిపై లైంగిక దాడికి బాలుడు యత్నం.. ఆమె ప్రతిఘటించడంతో హత్య

54చూసినవారు
పిన్నిపై లైంగిక దాడికి బాలుడు యత్నం.. ఆమె ప్రతిఘటించడంతో హత్య
10వ తరగతి చదువుతున్న ఓ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. నిద్రిస్తున్న పిన్నితో లైంగిక చర్య కోసం బాలుడు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్య చేశాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉప్పినంగడి సమీప గ్రామానికి చెందిన 37 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఉన్న బాలుడిపై అనుమానంతో బుధవారం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఇంట్లో వారికి చెబుతుందేమోనని భయంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

సంబంధిత పోస్ట్