గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్న యువతి ఆత్మహత్య

567చూసినవారు
గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్న యువతి ఆత్మహత్య
ప్రభుత్వ కొలువు కోసం సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌కు చెందిన సంగీత(24) మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో ఉంటూ గ్రూప్స్‌కి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే జూన్ నెలలో పరీక్షలు సమీపిస్తుండగా, తీవ్ర ఒత్తిడికి గురై మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :