బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గుజరాత్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గోన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ ముందు జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన అమీర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జెండాను ఆవిష్కరించగా వారితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కాగా, చాలా రోజుల తర్వాత అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సితారే జమీన్ పర్.