అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ఆదివారం సూపర్ సిక్స్ గ్రూప్-1లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 64/8కే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 7.1 ఓవర్లలో ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 40 పరుగులతో (31 బంతుల్లో) అదరగొట్టింది.