నాగ సాధువులు ఎక్కువ కాలం ఉపవాసదీక్షలో ఉంటారు. ఆహారం, ఆహార్యంపై వీరికి పెద్దగా పట్టింపు ఉండదు. పండ్లు, దుంపలు తీసుకుంటారు. ప్రపంచంలో జరిగే ఏ అంశాలతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. అందుకే రాగద్వేషాలకు అతీతంగా జీవిస్తారు. ఎముకలు కొరికే చలిలోనూ, నిప్పులు చెరిగే భానుడి తీవ్రతలోను నాగసాధువులు చలించరు. యథాప్రకారం తమ నిత్య కార్యాలు చేపడతారు. కుంభమేళాలు జరిగే తీర్థాలకు మాత్రమే హాజరవుతారు.