నేడు దాదాపు 30 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

54చూసినవారు
నేడు దాదాపు 30 మంది మంత్రుల ప్రమాణస్వీకారం
మోదీ 3.0 ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం నేటి సాయంత్రం జరగనుంది. ప్రధానితోపాటు దాదాపు 30మంది కీలక మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ సారి మొత్తం 78 మందికి పదవులు దక్కవచ్చని అంచనావేస్తున్నారు. గత మంత్రి వర్గంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగశాఖ భాజపా వద్దే కొనసాగనున్నాయి.

సంబంధిత పోస్ట్