TG: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. తాజాగా కారు రేసింగ్‌కు సంబంధించి ఏసీబీ.. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అలాగే ఈ కేసు వివరాలను ఏసీబీ అధికారులు ఈడీకి అందజేశారు. ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్‌ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్‌ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా ఏసీబీ.. ఈడీకి అందించింది. కాగా కొన్ని గంటల ముందే ఈడీ.. ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.