బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో శనివారం అతడిని గుర్తించిన రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా నిందితుడిని అదుపులోకి తీసుకుని, వీడియో కాల్ ద్వారా ముంబై పోలీసులతో మాట్లాడి, అతడేనని ధ్రువీకరించుకున్నారు. నిందితుడిని తీసుకొచ్చేందుకు ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరారు.