సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న వాహనాలతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ రద్దీ నెలకొంది. దీంతో చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ కూడళ్లలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. తూప్రాన్‌పేట, ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు ట్రాఫిక్‌కి అంతరాయం కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.