తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీని గద్దె దించేదాకా తాను చెప్పులు వేసుకోనని ప్రకటించారు. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు 6 సార్లు కొరడాతో కొట్టుకుంటానని మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా 48 రోజులు ఉపవాసం ఉండబోతున్నట్లు తెలిపారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమన్నారు.