ప్రముఖ నటుడు మోహన్ లాల్ కేరళలోని వయనాడ్ బాధితుల సంక్షేమం కోసం రూ.3 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాలు ఇచ్చారు. తమిళ నటులు సూర్య, జ్యోతిక దంపతులు రూ.50 లక్షలు, మమ్ముట్టి-దుల్కర్ రూ.40 లక్షలు, కమల్ హాసన్ రూ.25 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.