ఎయిర్​టెల్ నెట్ వర్క్ సేవల్లో తీవ్ర అంతరాయం

78చూసినవారు
ఎయిర్​టెల్ నెట్ వర్క్ సేవల్లో తీవ్ర అంతరాయం
దేశవ్యాప్తంగా  ఎయిర్​టెల్  నెట్ వర్క్ సేవల్లో గురువారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో  ఎయిర్​టెల్ మొబైల్, ఎయిర్​టెల్ బ్రాడ్ బ్యాండ్ సేవల్లో అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా 2,800 మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు  ఎయిర్​టెల్ స్పందించింది. “సేవలు ఇప్పుడు పూర్తిగా పునరుద్ధరించబడినాయి. మీ అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం'' అని ఎయిర్‌టెల్ పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్