అన్నాడీఎంకేలో చేరిన నటి గౌతమి

555చూసినవారు
అన్నాడీఎంకేలో చేరిన నటి గౌతమి
ప్రముఖ సినీ నటి గౌతమి బుధవారం అన్నాడీఎంకే పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (EPS) సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని EPS ఇంటికి ఆమె వెళ్లారు. చర్చల తర్వాత ఆ పార్టీలో గౌతమి చేరారు. ఇక ఆమె 2004 నుండి 2016 వరకు నటుడు కమల్ హాసన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తర్వాత ఆయనతో విడిపోయారు. ఇటీవల బీజేపీకి ఆమె రాజీనామా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్