తలపై పడ్డ మెషీన్.. వ్యక్తి స్పాట్‌డెడ్ (వీడియో)

192541చూసినవారు
మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. రెప్పపాటులో జరిగిన ప్రమాదాల్లో కొందరు చనిపోతున్నారు. గుజరాత్‌లోని సూరత్ నగరం సలాబత్‌పురా ప్రాంతంలో ఇలాంటి ఓ ప్రమాదం ఇటీవల జరిగింది. ఓ ఫ్యాక్టరీలో కంప్రెషర్ మెషీన్ పై నుంచి కింద పడింది. అది నేరుగా లలన్ మిశ్రా (40) అనే వ్యక్తి తలపై పడింది. దీంతో ఆ వ్యక్తి సంఘటనా స్థలంలోనే కుప్పకూలి చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్