రూ.4వేల కోట్ల బకాయిలు చెల్లించాలని బంగ్లాదేశ్‌కు అదానీ గ్రూప్‌ వార్నింగ్‌

80చూసినవారు
రూ.4వేల కోట్ల బకాయిలు చెల్లించాలని బంగ్లాదేశ్‌కు అదానీ గ్రూప్‌ వార్నింగ్‌
భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌ సంస్థ బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తమ సంస్థ నుంచి బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తున్న విద్యుత్ బకాయిలు ఇప్పుడు దాదాపు 500 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.4వేల కోట్ల) చేరుకున్నాయి. బకాయిలు చెల్లించాలని అదానీ గ్రూప్‌.. మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగించలేమని పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి సరఫరాను నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్