ఆదిలాబాద్: ఘనంగా దుర్గాదేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమం

61చూసినవారు
నవరాత్రుల్లో వాడవాడలా కొలువై ప్రత్యేక పూజలను అందుకున్న దుర్గాదేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమాలను శుక్రవారం భక్తులు ఘనంగా చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొజ్జవార్ మందిరంలో ప్రతిష్టించిన దుర్గా దేవి విగ్రహ నిమజ్జనం సందర్భంగా భారీ శోభయాత్రను చేపట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి మహిళలు మంగళ హారతులతో ముందుకు నడిచారు. శోభయాత్రలో భాగంగా పల్లకి సేవ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్