ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో ఆ సంఘం నేతలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విలాస్ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్మికుల సమస్యలు, హక్కుల సాధనకై ఏఐటియుసి ముందుండి పోరాడుతుందన్నారు. సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దేవేందర్, రాజు, రాములు, కాంతరావు తదితరులున్నారు