ఎమర్జెన్సీ వార్డ్ ఎదుట జూనియర్ డాక్టర్ల ఆందోళన

52చూసినవారు
కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఓపి సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించగా గురువారం వార్డుల్లో సైతం వైద్య సేవలను వారు బహిష్కరించి ఎమర్జెన్సీ వార్డ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని జూనియర్ డాక్టర్ల సంఘం సందీప్ చారి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్