బేల మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం కామదహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అశోక్ నగర్ కాల్ మీ శివారులో ఏర్పాటు చేసిన కామ దహనం వద్దకు కాలనీవాసులు డప్పుచప్పులతో వెళ్లి పూజలు చేశారు. అనంతరం కామ దహనం నిర్వహించి చుట్టూ నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు రేసు పోచ్చరెడ్డి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు. రేసు అనిల్, రవి,
రాజ్ నవీన్, మాడవార్ హరీష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.