మహాత్మా గాంధీజీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షిషా అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకొని స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను అధికారులు స్మరించుకున్నారు. వ్యక్తిగత జీవితంలో, అధికారిక విధులలో గాంధీజీ సూత్రాలు పాటించాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్ ఉన్నారు.