రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ కి తమ భూములను ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రూరల్ మండలం యాపల్ గూడ కు చెందిన రైతులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ కి తమ పంట భూములను ఇవ్వదలుచుకోలేమన్నారు. ఒకవేళ ఎకరానికి 40 లక్ష తో పాటు ఇంటికి ఉద్యోగం ఇస్తే ఆలోచిస్తామని పేర్కొన్నారు. రైతులను అధికారులు ఇబ్బందులు పెట్టవద్దని వారు కోరారు.