పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి డా. వి నరేందర్ రెడ్డి సూచించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతి ఒక్క పట్టభద్రుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టభద్రుల సమస్యలపై తనకు అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారు పేర్కొన్నారు.