నెలకొరిగిన భారీ వృక్షాలు.. గంటల తరబడి నిలిచిన రాకపోకలు

61చూసినవారు
నెలకొరిగిన భారీ వృక్షాలు.. గంటల తరబడి నిలిచిన రాకపోకలు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దింతో కొలం గూడ గ్రామం వద్ద రహదారిపై భారీ వృక్షాలు నేలకొరగడంతో గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్, అసిఫాబాద్ జిల్లాల నుండి ఆదిలాబాద్ వచ్చే వాహనాలు రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఓ రోగిని ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్స్ ను అతికష్టం మీద పంట క్షేత్రాల్లో నుండి దాటించారు.

సంబంధిత పోస్ట్