తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి పురస్కరించుకొని శనివారం ఆదిలాబాద్ లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు వర్గాల కోసం పరితపించిన మహా వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే కొనియాడారు.